సాంకేతికతను అందిపుచ్చుకొని, రాష్ట్రం నిర్వహిస్తున్న ఆరోగ్య సంస్థల్లో ఆరోగ్య సేవలకు, రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పథకాలకు సాంకేతికతను విస్తరించినందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ ‘సిఎస్ఐ నిహ్లెంట్ ఇ-గవర్నెన్స్ అవార్డులు- 2017’ను అందుకుంది. కెసిఆర్ కిట్స్ పథకం, తల్లి మరియు బిడ్డ ట్రాకింగ్ సిస్టమ్ (ఎంసిటిఎస్), ఆధార్ ద్వారా జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) వేతన జాబితాల ఆటోమేషన్, ఇ-హాస్పిటల్స్, ఇంకా అనేక అంశాల్లో సాంకేతికతను అనువర్తించడంలో అధికారులు విజయవంతమయ్యారు. కోల్‌కతాలో ఇటీవల నిర్వహించిన ఒక వేడుకలో పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిశ్రా, రాజస్థాన్ డిప్యూటీ స్పీకర్ల చేతుల మీదుగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, ఆరోగ్య శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియాస్ (సిఎస్‌ఐ) నిహిలెంట్ ఇ-గవర్నెన్స్ (సిఎన్‌ఇజి) అవార్డు స్వీకరించారు.
తెలంగాణకు ఆరోగ్య రంగంలో ఇ-గవర్నెన్స్ అవార్డు
