మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & పట్టణాభివృద్ధి శాఖ తన సంస్కరణలు, నవ్యావిష్కరణలు, పౌర-కేంద్రీయ విధానాలకు గాను వివిధ కేటగిరీల్లో 22 స్కోచ్ అవార్డులను అందుకుంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ మరియు డైరెక్టర్, మున్సిపల్ ప్రాంతాల్లో దారిద్ర్య నిర్మూలన విభాగం (ఎంఇపిఎంఎ) డైరెక్టర్ రెండు అవార్డులకు ఎంపికయ్యారు. సిద్ధిపేట మున్సిపాలిటీ ఆరు అవార్డులు, సిరిసిల్ల అయిదు అవార్డులు సాధించాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు మూడు, బోడుప్పల్, షాద్‌నగర్ మున్సిపాలిటీలు చెరో రెండు అవార్డులను అందుకున్నాయి.
MA&UD secures 22 Skoch awards
