ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు దార్శనికతతో, దేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం మరో నూతనాధ్యాయాన్ని లిఖించింది. ప్రపంచంలోనే ప్రప్రథమంగా బాబాసాహెబ్ డా. బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల మహా విగ్రహాన్ని అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం ఆవిష్కరించారు.
In tune with the vision of Chief Minister Sri K. Chandrashekhar Rao, Telangana State wrote another new chapter in the history of the country. On the occasion of Dr. BR Ambedkar‘s birth anniversary, CM KCR unveiled 125 feet giant statue of Dr. BR Ambedkar which is considered as the biggest one in the world. Thus Telangana, as an ideal, started a new era in India. Telangana witnessed a big platform to explain the neglect being faced by the Dalits and other communities due to the policies adopted by the successive governments at the centre in the presence of Ambedkar.
అంబేద్కర్ మహా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన, బాబాసాహెబ్ మనుమడు మాజీ లోక్ సభ సభ్యుడు శ్రీ ప్రకాశ్ అంబేద్కర్ ను తోడ్కొని ప్రగతి భవన్ నుంచి మధ్యాహ్నం 3.15 కు బయలు దేరిన సీఎం నేరుగా హుసేన్ సాగర్ పక్కనే ఆవిష్కరణకు సిద్ధమైన అంబేద్కర్ మహా విగ్రహం చెంతకు చేరుకున్నారు.
అక్కడ బౌద్ధ బిక్షువులు వారి సాంప్రదాయ పద్దతిలో ప్రార్థనలు చేస్తూ సీఎంకు ఆహ్వానం పలికారు. అక్కడే ఏర్పాటు చేసిన వేదక మీదికి చేరుకుని అక్కడ నుంచి విశ్వరూపుడై నిలిచిన అంబేద్కర్ మహా విగ్రహాన్ని తలెత్తి దర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అంబేద్కర్ విగ్రహానికి అలంకరించిన మహా పూలదండను సీఎం పరిశీలించారు.
పూలదండ తయారీతోపాటు పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దిన తీరు గురించి ఆరా తీసారు. విగ్రహావిష్కరణ ఏర్పాట్ల తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం మంత్రులు శ్రీ ప్రశాంత్ రెడ్డిని, శ్రీ కొప్పుల ఈశ్వర్ ను ఈ సందర్భంగా అభినందించారు.
Later, the CM inaugurated the base building where Ambedkar’s statue is erected from the hands of Prakash Ambedkar. After reaching the statue stage, monks offered prayers in the Buddhist tradition to the Ambedkar statue made with marble. CM participated in the special prayers.
అనంతరం బేస్ భవనంలో ఏర్పాటు చేసిన డా. బిఆర్ అంబేద్కర్ ఫోటో ఎగ్జిబిషన్ ను మంత్రులు, ప్రజాప్రతినిధులు, సీఎస్ సహా ప్రభుత్వ ఉన్నతాధికారులు వెంటరాగా సీఎం ప్రతి ఒక్క ఫోటోను ఆసక్తితో తిలకించారు. చారిత్రక సందర్భాలను గుర్తుచేసుకుంటూ ప్రకాశ్ అంబేద్కర్ తో చర్చిస్తూ ముందుకు సాగారు. అక్కడనుండి ఆడోటిరియానికి చేరుకున్న సీఎం గారు.. ఎస్సీ కార్పోరేషన్ వారు రూపొందించిన ఆత్మబంధువు అంబేద్కరుడు డాక్యుమెంటరీని ప్రకాశ్ అంబేద్కర్ తో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, సీఎస్ ఉన్నతాధికారులతో కలిసి వీక్షించారు. డాక్యమెంటరీలో పొందుపరిచిన అంబేద్కర్ జీవిత గాథను, భారత దేశానికి వారు చేసిన సేవలను, వాటితో పాటు అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా చేసుకుని తెలంగాణ ప్రభుత్వం దళితాభ్యున్నతికోసం అమలు చేస్తున్న దళితబంధు వంటి విప్లవాత్మక పథకాల వివరాలను, సాధించిన విజయాలతో కూడిన డాక్యుమెంటరీని సీఎం తిలకించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం అక్కడనుంచి నేరుగా ప్రకాశ్ అంబేద్కర్ ను తోడ్కొని సభా వేదికకు సీఎం చేరుకున్నారు.
వేదికమీదకు సీఎం చేరుకోగానే.. సభికులు జై భీం, జైతెలంగాణ, జై కేసీఆర్ నినాదాలు చేసారు. వారి నినాదాలతో సభా ప్రాంగణం మారు మోగింది. తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి ప్రసంగంతో సమావేశం ప్రారంభమైంది. 125 అడుగు అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా చేపట్టిన కృషిని ఈసందర్భంగా సీఎస్ వివరించారు. నిన్నటి దాకా ఎండలు కొట్టినప్పటికీ నేడు అంబేద్కర్ విగ్రహావిష్కరణ రోజున దేవుడి కరుణతో వాతావరణం చల్లగా మారిందని సీఎస్ అనడంతో సభికులు హర్షధ్వానాలతో చప్పట్లు మారుమోగాయి.
అనంతరం ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్ మాట్లాడారు. సీఎం శ్రీ కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ అభివృద్ధిశాఖ చేపడుతున్న చర్యలను, విగ్రహావిష్కరణకు చేపట్టిన కార్యాచరణను తెలిపారు.
తర్వాత అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన అంబేద్కర్ గారి మనమడు, లోక్ సభ మాజీ ఎంపి శ్రీ ప్రకాశ్ అంబేద్కర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం శ్రీ కేసీఆర్ భవిష్యత్తు జాతీయ నాయకుడుగా ఆవిర్భవించనున్నారని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. మహా విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలననను నడిపిస్తున్నారని కొనియాడారు. అంబేద్కర్ జన్మదిన వేడుకులను నిజమైన అర్థంలో తెలంగాణ ప్రభుత్వం జరపడం గొప్ప విషయమని ప్రకాశ్ అంబేద్కర్ అన్నారు.
అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన సందేశమిచ్చారు. ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ రాహుల్ బొజ్జా ధన్యవాదాలతో సభ ముగిసింది.
ఈ సందర్భంగా శ్రీ ప్రకాశ్ అంబేద్కర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
- అంబేద్కర్ భారీ విగ్రహం ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు
- అంబేద్కర్ మహావిగ్రహావిష్కరణ మరో చరిత్రకు నాంది పలికింది
- అంబేద్కర్ ఆదర్శాలు పాటించడమే ఆయనకు నిజమైన నివాళి
- సమాజంలో మార్పు కోసం అంబేడ్కర్ భావజాలం అవసరం
- సమాజంలో మార్పు రావాలంటే సంఘర్షణ తప్పదు
- రూపాయి బలోపేతం ఆవశ్యకతను అంబేడ్కర్ నొక్కి చెప్పారు
- రూపాయి స్థిరీకరణతో ఆర్థికంగా బలోపేతంగా కాగలమని అంబేద్కర్ నాడు వాదించారు.
- అంబేడ్కర్ రూపాయి సమస్యపై 1923 లోనే “ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ” అనే పరిశోధన పత్రం సమర్పించారు.
- అంబేద్కర్ ఆంగ్లేయులు భారత్‌ను ఎలా దోచుకుంటున్నారో గ్రహించారు
- ఆర్థిక దుర్భలత్వంపై పోరాడేందుకు కేసీఆర్ కృషిచేస్తున్నారు
- అంటరానితనాన్ని పారద్రోలడానికి అంబేడ్కర్ కృషిచేశారు
- దళితబంధు పథకం రూపొందించినందుకు కేసీఆర్‌కు ధన్యవాదాలు
- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం దేశానికే ఆదర్శనీయం.
- దళితబంధు పథకం సమాజానికి కొత్త దిశను చూపించింది.
- ఆర్థిక దుర్భలత్వాన్ని ఎలా ఎదుర్కోవాలో సీఎం కేసీఆర్ గారు దిశ చూపించారు
- అంబేడ్కర్ ఆశయాలను కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారు
- సమాజంలో కొన్ని అతిచిన్న కులాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి
- ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారు
- పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసేవరకు సమస్య పరిష్కరించలేదు
- తెలంగాణ కోసం కూడా గొప్ప పోరాటం జరిగింది
- చిన్న రాష్ట్రాల ప్రతిపాదనకు అంబేడ్కర్ మద్దతిచ్చారు.
- మార్పు కోసం మనం ఉద్యమించాలి
- ప్రజల కుల,మత రాజకీయాలకు దూరంగా ఉండాలి.
- తెలంగాణ అభివృద్ధి దేశానికి దారి చూపింది. కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ అభివృద్ధి చెందింది.
- డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని 125 అడుగుల విగ్రహావిష్కరణ అనంతరం జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ గారి ప్రసంగం – ముఖ్యాంశాలు:
- అంబేద్కర్ విశ్వమానవుడు. ఆయన ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం విశ్వజనీనమైనటువంటిది.. సార్వజనీనమైనటువంటింది.
- ఒక ఊరికో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో పరిమితమైంది కాదు.
- ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అణగారిన జాతులకు ఒక ఆశాదీపం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్.
- ఈరోజు ఆయన రచించిన రాజ్యాంగం 75 సంవత్సరాలు దాటిపోతావుంది. అంబేద్కర్ జయంతులు చేసుకుంటూ పోవడమేనా? ఆయన చెప్పింది ఏమైనా ఆచరించేది ఉందా? ఆ దిశగా ఏమన్నా కార్యాచరణ ఉందా, లేదా? అని మనందరం గుండెలమీద చెయ్యేసుకొని ఆలోచించుకోవాలి.
- ఇది భారతదేశం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది.
- ఇంకా ఆటలు, పాటలే కాదు.. కార్యాచరణ ప్రారంభం కావాలి. ఒక ఆచరణాత్మకమైనటువంటి ప్రారంభోత్సవం కావాలి.
- అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎవరో డిమాండ్ చేస్తేనో, చెబితేనో ఏర్పాటు చేసుకోలేదు.
- అద్భుతమైనటువంటి విశ్వమానవుని విశ్వరూపాన్ని, ఈ మూర్తి రూపాన్ని మనమిక్కడ ప్రతిష్టించుకున్నామంటే దానిలో ఒక బలమైన సందేశం ఉంది.
- ఇది ఉన్నటువంటి ప్రదేశం ఒక సుందర దృశ్యమే కాకుండా రాష్ట్ర పరిపాలనా సౌధమైనటువంటి సెక్రటేరియట్ పక్కనే ఉంది. మన పరిపాలనా సౌధానికి కూడా అంబేద్కర్ గారి పేరే పెట్టుకున్నాం.
- సెక్రటేరియట్ ముందే అమరుల స్మారకం కూడా ఉంది. అ పక్కనే హుస్సేస్ సాగర్ మధ్యలో అంబేద్కర్ గారు నమ్మిన బుద్ధ విగ్రహం ఉంది.
- ఇవన్నీ ఒక అద్భుతమైనటువంటి సందేశాత్మకమైనటువంటి చిహ్నాలు.
- అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపం, శాంతిమూర్తి బుద్ధుడిని ప్రతిరోజూ సెక్రటేరియట్ కు వచ్చే ముఖ్యమంత్రి, మంత్రులు, సెక్రటరీలకు ఎప్పటికప్పుడు అంబేద్కర్ గారి సిద్ధాంతం ఆలోచనల్లోకి వస్తూ ఉండాలె. అంబేద్కర్ గారిని చూస్తూ వాళ్ల మనసు ప్రభావితం కావాలె.
- ఆయన మార్గం పట్టాలని, ఆయన అనునిత్యం కలలో మెరవాలని, తమ జీవితాలను అర్పించి సాధించిన తెలంగాణ అమరులు ఆదర్శం కావాలనే విధంగా మనం రూపకల్పన చేసుకోవడం జరిగింది.
- ఇది విగ్రహం కాదు.. ఒక విప్లవం. ఇది కేవలం ఆకారానికి ప్రతీక కాదు, తెలంగాణ కలల సాకారానికి ఒక చైతన్య దీపిక అని మంత్రి హరీష్ రావు చెప్పడం జరిగింది. ఆ పద్ధతిలో దీనిని మనం ఆవిష్కరించుకోవడం జరిగింది.
- ఈ విగ్రహం ఏర్పాటు చేయడానికి ఆహోరాత్రులు కృషి చేసినటువంటి ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, అంతకుముందు ప్రారంభంలో ప్రయత్నించిన కడియం శ్రీహరి, దానికి కొనసాగింపుగా కొప్పుల ఈశ్వర్ దేశదేశాలు తిరిగి కృషి చేశారు. దీని నిర్మాణం విషయంలో నిద్రాహారాలు లేకుండా కృషి చేసిన ఆర్ అండ్ బి శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, ఈఎన్సీ శ్రీ గణపతి రెడ్డి, ఆర్ అండ్ బి సిబ్బంది, నిర్మాణ వ్యవస్థ, సిబ్బంది.. ఇందులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి నా పక్షాన, రాష్ట్ర ప్రభుత్వం పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్జ్ఞతలు తెలియజేస్తున్నాను.
- డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఒక శాశ్వతమైనటువంటి అవార్డును ఇవ్వాలని దళిత మేధావి కత్తి పద్మారావు పత్రికా ముఖంగా ఒక సూచన చేశారు.
- తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ గారి పేరిట ఒక అవార్డును ఇవ్వనున్నట్లు తక్షణమే ప్రకటిస్తున్నాను. వెంటనే ఆదేశాలు ఇస్తాం. రూ.51 కోట్లను డిపాజిట్ చేసి, దాని ద్వారా వచ్చిన వడ్డీ దాదాపు రూ.3 కోట్లతో దేశంలో, రాష్ట్రంలో ఉత్తమ సేవలు అందించినవారికి అంబేద్కర్ గారి పేరిట ప్రతి జయంతి రోజు అవార్డులను అందివ్వడం జరుగుతుంది.
- 70 ఎండ్ల క్రితం రాజ్యాంగం అమలు ప్రారంభమై, అనేక పార్టీలు గెలవడం, ఓడటం, ప్రభుత్వాలు మార్పు జరిగినా.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నేటివరకూ నిరుపేదలు ఎవరంటే దళితులు అనే మాట ఉండటం మనందరికి కూడా సిగ్గుచేటు. ఈ పరిస్థితి మారాలి. పార్టీలు ఓడిపోవటం, వేరే పార్టీలు గెలవడం కాదు. ఈ దేశంలో ప్రజలు గెలిచేటటువంటి రాజకీయం రావాలి. దానికోసం దళిత మేధావి వర్గం కూడా ఆలోచన చేయాలి.
- అన్నం ఉడికిందా? లేదా? అని కుండ మొత్తం చూడాల్సిన పనిలేదు. రెండు మూడు మెతుకులు చూస్తే చాలు. ఎవరి వైఖరి ఏ విధంగా ఉంది.. ఏ డైరెక్షన్ లో పనిచేస్తా ఉన్నరు.. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏవిధంగా పనిచేస్తా ఉన్నదో ఆలోచించాలి.
- టీఆర్ఎస్ పార్టీ రావడానికి ముందు ఇక్కడ పది సంవత్సరాలు వేరే పార్టీ రాజ్యం చేసింది. వాళ్ల పది సంవత్సరాల కాలంలో దళితుల అభివృద్ధి కోసం వాళ్లు పెట్టిన ఖర్చు కేవలం రూ.16వేల కోట్ల రూపాయలు.
- టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింతర్వాత ఈ పది సంవత్సరాలలో దళితుల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టిన మొత్తం రూ.1,25,062 కోట్లు. ఇవి కాగ్ నిర్ధారించిన విషయాలే.
- భారత దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక గొప్ప పనిని సాధించే కార్యక్రమం, దళితుల అభివృద్ధికి దోహదపడే కార్యక్రమం దళిత బంధు కూడా తెలంగాణ ప్రభుత్వం తెచ్చింది.
- రాష్ట్ర ప్రధాన కార్యాలయం సచివాలయానికే డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్నాం. ఈనెల 30న ప్రారంభం చేసుకోబోతున్నాం.
- వీటన్నింటినీ మించి శిఖరాయమానంగా ఆకాశమంత ఎత్తు ఉండేటటువంటి, మనందరికి మార్గదర్శనం చేసేటటువంటి ప్రపంచంలోనే కాదు..ఇండియాలోనే కాదు..ఎక్కడ కూడా లేనంత ఎత్తైనటువంటి మహోన్నత విగ్రహంను ప్రతిష్టించుకున్న ఘనత కూడా మన తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని మనవి చేస్తా ఉన్న.
- అనేక పార్టీలు కొలాహలాలు, గందరగోళాలు చేస్త ఉంటారు. కానీ వాస్తవ దృక్పథం వైపు ప్రయాణం దళిత బిడ్డలందరూ కొనసాగించే విధంగా దళిత మేధావి వర్గం ఆలోచించాలె. అందుకు సమాయత్తం కావాలని కూడా నేను మనవి చేస్తున్నా.
- నిజంగా పనిచేసేవాళ్లను ప్రోత్సహిస్తూ ముందుకు మరింత అభివృద్ధి సాధించే అవకాశం ఉంటది.
- కొన్ని విషయాలు చెప్పడానికి ఆత్మ విశ్వాసం కావాలి. గతంలో నేను చెప్పిన. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఢిల్లీ వెళ్తా ఉన్నా.. మళ్లీ తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెడతా అని చెప్పి పోయిన. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాసై, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే నేను తెలంగాణకు తిరిగి రావడం జరిగింది.
- మీ ముఖ్యమంత్రి ఇక్కడ చాలా కార్యక్రమాలు చేశారు. ఆయన జాతీయ రాజకీయాల్లో కూడా ఇదేరకమైన కార్యక్రమాలు చేయడానికి పార్టీని జాతీయస్థాయిలో విస్తరించారు.. మీ అందరి ఆశీస్సులు మీ ముఖ్యమంత్రి గారికి ఉండాలని ప్రకాష్ అంబేద్కర్ గారు చెప్పారు.
- వచ్చే 2024 పార్లమెంటు ఎన్నికలల్లో రాబోయే రాజ్యం మనదే..మనదే..మనదే ఈ భారత దేశంలో అని నేను మనవి చేస్తున్నా.
- మన శత్రువులకు మింగుడు పడకపోవచ్చు. కానీ చిన్న మిణుగురు చాలు అంటుకోవాడానికి.
- మహారాష్ట్రకు పోతే నేను కలలో కూడా అనుకోనటువంటి, ఊహించనటువంటి ప్రోత్సాహం, ఆదరణ అక్కడ వస్తా ఉంది.
- ఈరోజు మహారాష్ట్రలో వస్తున్నటువంటి ప్రజాదరణ, ప్రోత్సాహం..రేపు ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్.. ప్రతీచోట కూడా వస్తది.
- ఖచ్చితంగా భారత దేశంలో మన పాలన వస్తుంది.
- రేపటిరోజున తెలంగాణ దళిత బంధు దేశంలో మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఖచ్చితంగా ప్రతి సంవత్సరం 25 లక్షల దళిత కుటుంబాలకు అమలు చేస్తాం. అన్ని రాష్ట్రాల వారికి కూడా ఈ సదుపాయం అందుతుందని మనవి చేస్తా ఉన్నాను.
- అంబేద్కర్ గారి కలలు ఇంకా నెరవేరలేదు. నెరవేర్చాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. వారి కలలు సాకారం కావాలె. ఆయన అనుకున్నటువంటి ఎన్నో విషయాలు సాకారమయ్యాయి.
- ఏదో ఒక ఒరవడిలో కొట్టుకొనిపోవడం కాకుండా, ఒక గాల్లో పోవడం కాకుండా ఎవరైతే నిర్ద్వందంగా నిజమైన శ్రద్ధతోని పేద ప్రజలను ఆశీర్వదించేవిధంగా పోతున్నరో వారికే మీ బలం అందాలె. మనం చీలిపోతే దెబ్బతినే ప్రమాదం ఉంటది. కలిసికట్టుగా ముందుకుపోతే విజయం మనదే.
- మన రాష్ట్రంలో ఇప్పుడు 50 వేల మందికి దళిత బంధు సదుపాయం అందింది.ఈ ఆర్థిక సంవత్సరంలో మరో లక్షా పాతిక వేల మందికి ఈ సదుపాయం అందబోతున్నది. దీనిని బ్రహ్మండంగా సద్వినియోగం చేయాలని నాయకులు, అధికారులందరినీ కోరుతున్నాను.
- దేశంలోనే ఎక్కడాలేనటువంటి అద్భుతమైన ఆదర్శమూర్తి విగ్రహాన్ని గొప్పగా తీర్చిదిద్దుకున్నందుకు గర్వంగా ఉంది. ఈ సమయంలో ఈ అవకాశం నాకే కలిసి వచ్చినందుకు నా జన్మ ధన్యమైందని నేను మనవి చేస్తా ఉన్నా.
- రాబోయే రోజుల్లో కూడా బాబాసాహెబ్ బాటలో తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, భారతదేశాన్ని కూడా సరైన మార్గంలో పెట్టడానికి చివరి రక్తపుబొట్టు వరకు పోరాటం చేయడం జరుగుతది. ఎక్కడకూడా రాజీపడే ప్రసక్తే లేదని తెలియజేస్తున్నాను.
- అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మరొక్కసారి జై భీమ్ తెలియజేస్తున్నాను.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ ప్రకాశ్ అంబేద్కర్, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్, కౌన్సిల్ ఛైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ శ్రీ బండ ప్రకాష్ మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ హరీష్ రావు, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీ జగదీష్ రెడ్డి, శ్రీ శ్రీనివాస్ గౌడ్, శ్రీ మహమూద్ అలీ, శ్రీ గంగుల కమాలకర్, శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, శ్రీ పువ్వాడ అజయ్ కుమార్, శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీమతి సత్యవతి రాథోడ్, శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీ మల్లా రెడ్డి, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీలు శ్రీ జోగిన పల్లి సంతోష్ కుమార్, శ్రీ కె. కేశవ రావు, శ్రీ బిబి పాటిల్, శ్రీ పసునూరి దయాకర్, శ్రీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రీ మధుసూధనాచారి, ప్రభుత్వ విప్ శ్రీ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు శ్రీ రసమయి బాలకిషన్, శ్రీ ఆరూరి రమేష్, శ్రీ గువ్వల బాలరాజు, శ్రీ మెతుకు ఆనంద్, స్థానిక ఎమ్మెల్యే శ్రీ దానం నాగేందర్, తెలంగాణ వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ది సంస్థ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ ఎర్రోళ్ళ శ్రీను మహారాష్ట్ర బిఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీ మానిక్కదం,
Council Deputy Chairman Sri Banda Prakash, SC Corporation Chairman Sri Banda Srinivas, MLC Sri Madhusudanachari, Ware Housing Corporation Chairman Sri Sai Chand, Telangana Sports Authority Chairman Sri Anjaneya Goud, Disabled Corporation Chairman Sri Vasudeva Reddy, Women Commission Chairperson Smt. Sunita Lakshmareddy, Minority Commission Chairman Sri Takh Ansari and others are present.
ఎస్సీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ రాహుల్ బొజ్జా, ప్రొఫెసర్ లింబాద్రి, టిఎస్ పిఎస్ సి మాజీ ఛైర్మన్ శ్రీ ఘంటా చక్రపాణి, బుద్దవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ శ్రీ మల్లెపల్లి లక్ష్మయ్య, తదితర ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
సభలో హైలెట్స్:
- దళితుల్లో ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ను అభివృద్ధి పరుస్తూ, వారికి వ్యాపార, ఉపాధి మార్గాల దిశగా కృషి చేస్తున్న డిక్కీ (దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్) సంస్థకు రాష్ట్ర ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ సీఎం సంస్థ బాధ్యులు నర్రా రవి కుమార్ కు భూపట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కూడా ఉన్నారు.
- దళిత అభివృద్ధి, సంక్షేమ శాఖ పరిధిలోని ఎస్సీ డెవలప్ మెంట్ కార్పోరేషన్ వారి ఆధ్వర్యంలో రూపొందించిన ‘దళితబంధు విజయగాథలు’ వీడియో సీడీని ప్రకాశ్ అంబేద్కర్ చేతుల మీదుగా సీఎం కేసీఆర్ ఆవిష్కరింపచేశారు. ప్రకాశ్ అంబేద్కర్ గారిని ఘనంగా సత్కరించి బుద్ధుని ప్రతిమను అందజేశారు.
- సీఎం ప్రసంగాన్ని ప్రారంభించగానే సభికుల్లో ఆనంద హర్షాతిరేకాలు ప్రారంభమయ్యాయి. పలు జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అంబేద్కర్ అభిమానులు, దళిత, బహుజన వర్గాలు, ఇతరులు జై భీమ్ –జై భారత్ – దేశ్ కి నేత కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. కొన్ని నిమిషాల పాటు నినాదాలు మారుమోగుతుండటంతో సీఎం కేసీఆర్ గారు వారితో గొంతు కలిపి జై భీమ్ నినాదాలు చేశారు.
- సభలో ప్రజాప్రతినిధులతో పాటు ప్రొఫెసర్లు, దళిత, బహుజన మేధావులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని చారిత్రక సందర్భంలో భాగస్వాములయ్యారు.
- ఊహించిన దానికంటే అధిక సంఖ్యలో జనం పాల్గొనగా, అంబేద్కర్ మహా విగ్రహావిష్కరణ, అంబేద్కర్ జయంతుత్సవాలు ఘనంగా ప్రశాంతంగా ముగిసాయి.