ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి
Telangana Logo

రాష్ట్ర చిహ్నాలు

ఈ క్రింద పేర్కొన్న నాలుగు చిహ్నాలను కొత్త రాష్ట్రం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది:

  • రాష్ట్ర పక్షి – పాలపిట్ట (ఇండియన్ రోలర్ లేదా బ్లూ జే).
  • రాష్ట్ర జంతువు - జింక (డీర్).
  • రాష్ట్ర వృక్షం – జమ్మిచెట్టు (ప్రోసోపిస్ సినెరరియా).
  • రాష్ట్ర పుష్పం – తంగేడు (టన్నర్స్ కాసియా)

ఈ చిహ్నాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి, వీటిలో మూడు- తంగేడు పువ్వులు, బ్లూ జే, జమ్మి చెట్టు- సుప్రసిద్ధమైన పండుగలు బతుకమ్మ, దసరాలతో ముడిపడి ఉన్నాయి. తంగేడు పువ్వులను బతుకమ్మల మీద పేర్చడానికి ఉపయోగిస్తారు, దసరా రోజున బ్లూ జేని చూడడం మంచి శకునంగా భావిస్తారు, ఆ రోజున జమ్మి చెట్టును ప్రజలు పూజిస్తారు.

పాలపిట్ట


పాలపిట్ట లంకపై దండయాత్ర చెయ్యడానికి ముందు శ్రీరాముడు పాలపిట్టను చూశాడు, రావణుడిని సంహరించాడు. తెలంగాణను విజయపథంలో నిలపడం కోసం పాలపిట్టను ఎంచుకోవడం జరిగింది.

Jinka

జింక


భారతదేశ చరిత్రతో జింకకు లోతైన అనుబంధం ఉంది, ఈ మనోహరమైన జంతువు ప్రస్తావన మహా కావ్యమైన రామాయణంలో ఉంది. ఇది చిన్న అడవుల్లో కూడా మనుగడ సాగించగలదు. ఇది చాలా సున్నితమైనది, అమాయకమైనది, తెలంగాణ ప్రజల మనస్తత్వాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.

Shami Tree

జమ్మిచెట్టు


జమ్మి చెట్టుకు పూజలు చేసిన తరువాత మాత్రమే కౌరవుల బ్రహ్మాండమైన సైన్యాన్ని పాండవులు జయించారు. అరణ్యాల్లో అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చినప్పుడు, తమ ఆయుధాలను వాళ్లు ఒక జమ్మి చెట్టు మీద దాచారు. ఇప్పుడు, తెలంగాణకు జమ్మి చెట్టు ఆశీస్సులు కావాలి.

Tangedu Flower

తంగేడు పువ్వు


తంగేడు పువ్వును బతుకమ్మ పండుగ సమయంలో మహిళలు ఉపయోగిస్తారు, రాష్ట్ర పుష్పంగా ఇది అత్యంత సమంజసమైన ఎంపిక.

Skip to content