2016-17 సంవత్సరానికి గాను మహాత్మ గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్) అమలులో అయిదు ప్రతిష్టాత్మకమైన అవార్డులను తెలంగాణ సాధించింది. ఈ పథకాన్ని ప్రభావశీలంగా అమలు చేసిన వరంగల్ జిల్లా, అలాగే మనోహరా బాద్ (నిజామాబాద్ జిల్లా) సర్పంచ్ అత్యధిక ఉపాధి దినాలను అందజేసినందుకు వ్యక్తిగత పురస్కారాలు సాధించారు. సకాలంలో చెల్లింపులన్నిటినీ పరిష్కరించినందుకు శ్రీ అబ్దుల్ సత్తార్‌కు పోస్ట్ ఆఫీస్ అవార్డు లభించింది, రాష్ట్రానికి దీనదయాళ్ గ్రామీణ కౌశల్ యోజన (డిడియు కెకెవై) అవార్డు), ‘భువన్’ సాఫ్ట్‌వేర్‌ను అత్యుత్తమంగా వినియోగించుకున్నందుకు పంచాయతీరాజ్ శాఖకు జియో-ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్ అవార్డులు లభించాయి.
ఎన్‌ఆర్‌జిఇఎస్ అమలులో తెలంగాణకు 5 అవార్డులు
