భారత ఆహార, వ్యవసాయ మండలి (ఐసిఎఫ్ఎ) వ్యవసాయ నాయకత్వ అవార్డు-2017కు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర రావు ఎంపికయ్యారు. సాగునీరు, వ్యవసాయ రంగాల్లో ఆయన చేపట్టిన మార్గదర్శకమైన చర్యలకు ఇది గుర్తింపుగా ఎంపిక కమిటీ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చొరవలు ‘గ్రామీణ రంగంలో విస్తృతమైన ప్రభావాన్ని సృష్టించినట్టు’, లక్షలాదిమంది రైతుల జీవితాలకు ప్రయోజనం కలిగించినట్టు కమిటీ పేర్కొంది, న్యూఢిల్లీలో జరిగిన 10వ గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్‌షిప్ సదస్సులో హర్యానా గవర్నర్ ప్రొఫెసర్ డాక్టర్ కె.ఎస్. సోలంకీ చేతుల మీదుగా రాష్ట్ర వ్యవసాయ మంత్రి శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి అందుకున్నారు.
ముఖ్యమంత్రికి ఐసిఎఫ్ఎ వ్యవసాయ నాయకత్వ అవార్డు
