జిడబ్ల్యుఎంసికి స్కోచ్ అవార్డు

GWMC-recieved-SKOCH-Award

స్కోచ్ ‘ఆర్డర్ ఆఫ్ మెరిట్’ అవార్డు-2017ను గెలుచుకున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జిడబ్ల్యుఎంసి) వివిధ విభాగాల్లో స్కోచ్ పురస్కారాల కోసం ఎంపిక చేసిన 123 నగరాల్లో అత్యుత్తమ నగరంగా ‘స్కోచ్ గోల్డ్’ అవార్డును కూడా సాధించింది. న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో ఈ అవార్డును మేయర్ నన్నపునేని నరేందర్ అందుకున్నారు. స్కోచ్ గ్రూప్ గుర్గావ్ కేంద్రంగా పని చేస్తోంది, ఇది రాష్ట్రాలను స్వతంత్రంగా మదింపు చేసే సంస్థ, బహిరంగ మల విసర్జనను నిర్మూలించడం, పారిశుద్ధ్యం, పౌర ఆరోగ్యాలను పెంపొందించడంలో అత్యుత్తమంగా పని చేసే ప్రభుత్వ విభాగాలనూ, సంస్థలనూ ప్రోత్సహించడానికి ఈ సంస్థఅవార్డులు అందజేస్తుంది. వరంగల్ నగరం ఇటీవల అత్యుత్తమ వారసత్వ నగరం అవార్డు, ‘ఉన్నత్ భారత్ అభియాన్’ అవార్డు కూడా గెలుచుకుంది.