తెలంగాణకు బెస్ట్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవార్డు

Best-urban-infrastructure-award-for-Telangana

దేశంలో అత్యుత్తమ పట్టణ మౌలిక సదుపాయాలు కలిగిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఎంపికయింది. మిషన్ భగీరథ (పట్టణ), హరిత హారం, పట్టణ ప్రాంతాల్లో రెండు పడకల గదుల గృహ నిర్మాణ పథకాలు లాంటి వినూత్న కార్యక్రమాలకు అపారమైన ప్రశంసలు లభించాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ కార్యదర్శి శ్రీ నవీన్ మిట్టల్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ శ్రీ అరవింద్ కుమార్ ఈ అవార్డు స్వీకరించారు.