తెలంగాణ నీటిపారుదల శాఖకు సిబిఐపి అవార్డు

Telangana-irrigation-department-bags-CBIP-award

ప్రతిష్టాత్మకమైన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ అవార్డును 2018 సంవత్సరానికిగాను తెలంగాణ నీటిపారుదల శాఖ అందుకుంది. రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేసినందుకు ఈ అవార్డును బహూకరించారు. నదులను పునరుద్ధరించడానికీ, నీటి వనరులను పరిరక్షించడానికీ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ అవార్డును న్యూఢిల్లీలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో చిన్న నీటి పారుదల శాఖ సిఇ శ్రీ శ్యామసుందర్‌కు కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ అందజేశారు.