హైదరాబాద్‌కు స్వచ్ఛత ఎక్సలెన్స్ అవార్డు

Hyderabad-bags-Swachhata-Excellence-Award

దీనదయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ (డే-ఎన్‌యుఎల్‌ఎం) స్వచ్ఛత ఎక్స్‌లెన్స్ అవార్డును హైదరాబాద్ సొంతం చేసుకుంది. స్వచ్ఛత ఎక్స్‌లెన్స్ అవార్డు సాధించిన పదిలక్షలకు పైబడిన జనాభా ఉన్న మెట్రో నగరం హైదరాబాద్ మాత్రమే. 2019 ఫిబ్రవరి 15న న్యూఢిల్లీలో కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ డిఎస్. మిశ్రా చేతుల మీదుగా స్వచ్ఛత ఎక్స్‌లెన్స్ అవార్డును గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) కమిషనర్ శ్రీ. ఎం. దానకిషోర్ అందుకున్నారు.