దేశంలో రహదారుల భద్రత మరియు స్మార్ట్ ట్రాఫిక్ నిర్వహణలో హైదరాబాద్ పోలీసులు ఎస్‌కెఓసిహెచ్ గోల్డ్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డులను న్యూఢిల్లీలో జరిగిన స్కోచ్ అవార్డుల 2019 కార్యక్రమంలో బహూకరించారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తరఫున స్కోచ్ గోల్డ్ అవార్డును, షీ టీమ్స్, భరోసా, సీసీటివి నిఘా ప్రాజెక్ట్, డయల్ 100 వ్యవస్థలకు గాను స్కోచ్ సిల్వర్ అవార్డులను ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఎం. నరసింగరావు అందుకున్నారు.
స్కోచ్ అవార్డులు అందుకున్న హైదరాబాద్ పోలీసులు
