ప్రభుత్వ భూములు, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్లు, సర్వే మరియు సెటిల్మెంట్స్, ధర్మాదాయం తదితరలకు సంబంధించిన కార్యకలాపాలను రెవెన్యూ శాఖ నిర్వహిస్తుంది. భూమి శిస్తులు, ఎక్సైజ్, వాణిజ్య పన్నులకు సంబంధించిన చట్టాలను, నియమాలను ప్రతిపాదించడం, అమలు చేయడం రెవెన్యూ శాఖ ప్రధాన విధులు అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్ మెంట్ కు సంబంధించిన కేసులన్నిటినీ పర్యవేక్షిస్తుంది. రెవెన్యూ శాఖలోని అన్ని గ్రేడ్ల అధికారులు, ఉద్యోగులకు వ్యతిరేకంగా దాఖలైన క్రమశిక్షణ కేసులను పర్యవేక్షిస్తుంది. రెవెన్యూ శాఖకు సంబంధించిన అంశాలపై నియమితులైన దర్యాప్తు కమిషనర్‌కు సంబంధించిన అన్నికేసులనూ, రెవెన్యూ శాఖ నియంత్రణలో ఉన్న శాఖాధిపతుకలు సంబంధించిన సర్వీసు అంశాలనూ చేపడుతుంది