ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి
Telangana Logo

గవర్నర్

Dr-Tamilisai-Soundararajan-Telangana-Governor

డాక్టర్ (శ్రీమతి) తమిళిసై సౌందరరాజన్

గౌరవనీయ గవర్నర్

పేరు:డాక్టర్ (శ్రీమతి) తమిళిసై సౌందరరాజన్
పేరుడాక్టర్ (శ్రీమతి) తమిళిసై సౌందరరాజన్
Date of Birthజూన్ 2, 1961
Age62
Spouseడాక్టర్ పి. సౌందరరాజన్
Birth Placeనాగర్‌కోయిల్, కన్యాకుమారి జిల్లా
విద్యఎం.బి.బి.ఎస్
Office040-23310521; Fax: 040-23311260
Residence040-23310521

డాక్టర్ (శ్రీమతి) తమిళిసై సౌందరరాజన్ 1961 జూన్ 2వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌లో జన్మించారు. డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ 2019 సెప్టెంబర్ 8 న తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు మరియు ఈ పదవిని నిర్వహించిన తొలి మహిళగా నిలిచారు.

తమిళిసై సౌందరరాజన్ గారు 20 సంవత్సరాలకు పైగా విశేషమైన ప్రజా & సామాజిక సేవా నేపథ్యాన్ని కలిగి ఉన్నారు. గత రెండు దశాబ్దాలలో ప్రముఖ రాజకీయ నాయకురాలిగా కూడా ప్రసిద్ధి పొందారు, ఒక రాజకీయ పార్టీ యొక్క రాష్ట్ర విభాగాన్ని విజయవంతంగా నడిపించారు.

డా. తమిళిసై సౌందరరాజన్ తన ఎంబిబిఎస్, పి.జి పూర్తి చేసిన తర్వాత గైనకాలజీలో (డిజీఓ) విభాగంలో మెడికల్ ప్రాక్టీషనర్‌గా తన వృత్తిని ప్రారంభించారు. ఆమె కెనడాలోని టొరంటోలో అల్ట్రాసౌండ్ మరియు ఫీటల్ థెరపీపై ప్రత్యేక శిక్షణ పొందారు. ఆమె చెన్నైలోని శ్రీ రామ చంద్ర మెడికల్ కాలేజీలో గైనకాలజీ విభాగంలో 7 సంవత్సరాలు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. పూర్తి సమయం రాజకీయ జీవితం కోసం 2003లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.

ఆరోగ్యం మరియు విద్య ప్రధాన ఎజెండాగా ప్రజా సేవ మరియు సాధారణ ప్రజల జీవన ప్రమాణాల పెంపుదల పట్ల క్రుషి చేశారు. ఆమె ఒక రాజకీయ పార్టీకి రాష్ట్రాధిపతిగా, ఆదర్శప్రాయమైన నిర్వహణ నైపుణ్యాలు మరియు ప్రజానుకూల సేవా పరిసరాలతో దానిని నడిపించారు.

డా. తమిళిసై సౌందరరాజన్ యుఎస్ కాంగ్రెస్ సభ్యుడు డానీ కె. డేవిస్ ఆధ్వర్యంలో యుఎస్ఏలోని మల్టీ ఎత్నిక్ అడ్వైజరీ టాస్క్‌ఫోర్స్ ద్వారా సమాజానికి ముఖ్యంగా రాజకీయాలు, ప్రజా మరియు వైద్య సేవల రంగంలో ఆమె చేసిన సేవలకు "ఇంటర్నేషనల్ రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్ - 2018" అనే అంతర్జాతీయ అవార్డును అందుకున్నారు.

డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ మెరుగైన ఆరోగ్యం మరియు నివారణ సంరక్షణ ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడం పట్ల విశేష కృషి చేశారు. మన దేశం యొక్క సామాజిక మరియు సాంస్కృతిక బలాలకు గొప్ప ఆరాధకురాలిగా మరియు ప్రాథమిక విద్యా విధానంలో మరియు విలువలు మరియు వినయాన్ని చేర్చడం పట్ల చాలా శ్రద్ధ వహించారు.

డా. తమిళిసై సౌందరరాజన్ సమాజ అభివృద్ధి మరియు పౌరుల శ్రేయస్సు పట్ల చాలా దృష్టి పెట్టారు.

వృత్తిగా వైద్యం మరియు వృత్తి వివరాలు

వివరణవివరాలు
వైద్య అర్హతడాక్టర్ (ఎంబిబిఎస్, డిజీఓ)
ప్రొఫెషనల్ స్పెషలైజేషన్గైనకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్
ప్రత్యేక శిక్షణసోనాలజీ మరియు ఫీటల్ థెరపీ (కెనడా, ఆస్ట్రేలియా మరియు లండన్)
పని అనుభవంఅసిస్టెంట్‌ ప్రొఫెసర్ (చెన్నైలోని శ్రీ రామ చంద్ర మెడికల్ కాలేజీలో గైనకాలజీ విభాగం) 7 సంవత్సరాలు పనిచేశారు. మరియు పూర్తి సమయం రాజకీయ కార్యక్రమాల కోసం 2003లో రాజీనామా చేశారు.

రాజకీయ వృత్తి

వివరణవివరాలు
విద్యార్థి నాయకులుమద్రాస్ మెడికల్ కాలేజీ
1999 నుండి 2001 వరకుదక్షిణ చెన్నై జిల్లా మెడికల్ వింగ్ కార్యదర్శి
2001 నుండి 2004 వరకురాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైద్య విభాగం
2004 నుండి 2005 వరకుజోనల్ ఇన్‌చార్జి (3 జిల్లాలు)
2005 నుండి 2007 వరకుఆల్ ఇండియా కో-కన్వీనర్ (వైద్య విభాగం మరియు సదరన్ స్టేట్స్) మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి
2007 నుండి 2010 వరకురాష్ట్ర ప్రధాన కార్యదర్శి (తమిళనాడు బిజెపి మాతృ సంస్థ) మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి
2010 నుండి 2013 వరకురాష్ట్ర ఉపాధ్యక్షులు (తమిళనాడు బిజెపి మాతృ సంస్థ) మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి
2013 నుండి 2014 ఆగస్టు వరకుజాతీయ కార్యదర్శి (అఖిల భారత బిజెపి) మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి
2014 ఆగస్టు నుండి 2019 సెప్టెంబర్ 1 వరకుతమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలు – బిజెపి

వ్యక్తిగత సహకారం

  • తమిళ సాహిత్య వేదిక ఉపాధ్యక్షులు
  • వైద్య శాస్త్రం కోసం “గైడ్‌లైన్స్ టు సోనాలజీ” అంశంపై 2 వైద్య పుస్తకాల రచన
  • మన గౌరవ ప్రధాని మోదీ గారిపై 2 పుస్తకాల రచన
    “అచిఎవెమెంట్స్ అఫ్ మోడీ జి – తమిళ్” మరియు “మోడీ జి శ్రీలంకం విసిట్”)
    • "హౌ టు విన్ ఎలెక్షన్స్" అనే పుస్తక రచన
    • “కోట్స్ ఆఫ్ శ్రీ అమిత్ షా జి” పై పుస్తక రచన
    • తమిళ సాహిత్యంలో “సిప్స్ ఆఫ్ టీ” పుస్తక రచన
  • అనేక తమిళ మరియు ఆంగ్ల పత్రికలలో సాహిత్య మరియు రాజకీయ కథనాల రచన
  • బలమైన డిబేటర్ మరియు వక్త – 10 సంవత్సరాలుగా ప్రముఖ తమిళ టీవీ ఛానెల్‌లో విద్యార్థుల కోసం పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ & టాలెంట్ డెవలప్‌మెంట్ చొరవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
  • సామాజిక సేవా కార్యకలాపాలు - మహిళా సాధికారత, నివారణ ఆరోగ్య కార్యక్రమాలు మరియు మహిళల కోసం వైద్య శిబిరాల నిర్వహణ
  • మన జాతీయ నాయకుల ప్రసంగాలన్నింటికి తమిళ అనువాదకులు
  • సంచాలకులు (స్వతంత్ర బాధ్యత), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా- 2019 సెప్టెంబర్ 1 వరకు.
  • సామాజిక ఖ్యాతి ఉన్న అనేక సాహిత్య సంస్థలతో రచయిత & కంటెంట్ కంట్రిబ్యూటర్.

ఈమెయిల్ ఐడి: rajbhavan-hyd[at]gov[dot]in

గౌరవనీయ గవర్నర్ అపాయింట్‌మెంట్ కోసం, దయచేసి దీనికి ఇమెయిల్ చేయండి: adc-rbhyd[at]gov[dot]in

Skip to content