నూతనంగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మొట్టమొదటి సమీక్షా సమావేశం నిర్వహించారు.
సుప్రీంకోర్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తాగునీటి పనులను కొనసాగించడానికి అనుమతించిన నేపథ్యంలో ఈ రోజు సమీక్షా సమావేశంలో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించిన పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కూలంకంషంగా చర్చించారు.
ఇందులో భాగంగా జూలై వరకు కరివెన జలాశయంకు నీళ్ళు తరలించాలని, ఆగష్టు వరకు ఉద్దండాపూర్ వరకు నీటిని ఎత్తిపోయాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో నార్లపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్ జలాశయాలకు సంబంధించి మిగిలిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, వాటి సంబంధిత పంప్ హౌజ్ లు, విద్యుత్ సబ్ స్టేషన్లు, ఒక రిజర్వారయ్ నుంచి మరొక రిజర్వాయర్ కు నీటిని తరలించే ‘కన్వేయర్ సిస్టమ్’ లో మిగిలిన పనులను కూడా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
పాలమూరు జిల్లాలో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పనులకు సంబంధించిన పురోగతిపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. వాటిలో మిగిలిన కొద్దిపాటి పనులను ఈ జూన్ లోగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు… మంత్రులు శ్రీ నిరంజన్ రెడ్డి, శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎంపీలు శ్రీ పోతుగంటి రాములు, శ్రీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, శ్రీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ మర్రి జనార్ధన్ రెడ్డి, శ్రీ కాలె యాదయ్య, శ్రీ ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీ పట్నం నరేందర్ రెడ్డి, శ్రీ ఎస్ రాజేందర్ రెడ్డి, శ్రీ గువ్వల బాలరాజు, శ్రీ హర్షవర్ధన్ రెడ్డి, శ్రీ లక్ష్మా రెడ్డి, శ్రీ అంజయ్య యాదవ్, శ్రీ ప్రకాశ్ గౌడ్, శ్రీ మహేష్ రెడ్డి, శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి, శ్రీ జైపాల్ యాదవ్, శ్రీ మెతుకు ఆనంద్, శ్రీ పైలట్ రోహిత్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ శ్రీ సాయిచంద్.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, సీఎం కార్యదర్శి శ్రీమతి స్మితా సబర్వాల్, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ రామ కృష్ణా రావు, ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ రజత్ కుమార్, సీఎం ఓఎస్డీ శ్రీ శ్రీధర్ రావు దేశ్ పాండే, ఈఎన్సీ శ్రీ మురళీధర్ రావు, అడ్వైజర్ లిఫ్ట్ ఇరిగేషన్ శ్రీ పెంటారెడ్డి, మిషన్ భగీరథ ఈఎన్సీ శ్రీ కృపాకర్ రెడ్డి, సీఈలు శ్రీ హమీద్ ఖాన్, శ్రీ ధర్మా, ఎస్ఈలు శ్రీ రంగారెడ్డి, శ్రీ శ్రీనివాస్, శ్రీ విజయ భాస్కర్ రెడ్డి, శ్రీ చక్రధర్, శ్రీ ఎఎస్ఎన్ రెడ్డి, ట్రాన్స్ కో డైరక్టర్ శ్రీ సూర్య ప్రకాశ్, డిఈ పిఆర్ఎల్ఐఎస్ శ్రీ సయ్యద్ మోయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.