నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవం

Inauguration-of-Nirmal-Collectorate
CM-KCR-addressing-after-inaugurating-Nirmal-Collectorate

​నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ముఖ్యమంత్రి అనంతరం పూజా కార్యక్రమాల్లో పాల్గొని శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.

 

  • నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవ సమావేశంలో సీఎం ప్రసంగం – ముఖ్యాంశాలు:
  • మీ అందరికీ మరోమారు తెలంగాణ దశాబ్ధి ఉత్సవ శుభాకాంక్షలు.
  • తెలంగాణ వచ్చిన తర్వాత మనందరి యొక్క సమిష్టి కృషితో చాలా గొప్ప ఫలితాలు సాధించగలిగాం.
  • విసిరేసినట్టు అక్కడా ఇక్కడా ఉన్న జిల్లా ఇవ్వాల నాలుగు జిల్లాలుగా విభజించబడి ఎక్కడిక్కడే పరిపాలనా బ్రహ్మాండంగా ప్రజలకు చేరువలోకి వచ్చింది.
  • నాలుగు మెడికల్ కాలేజీలతో అదిలాబాద్ జిల్లా వర్థిల్లబోతోందంటే ఆసిఫాబాద్ లాంటి అటవీ ప్రాంతంలో కూడా ఇవ్వాల మెడికల్ కాలేజి వస్తుందంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రం వల్లనే. ఆంధ్రప్రదేశ్ అట్లాగే ఉంటే ఇంకో యాభై ఏండ్లకు కూడా వచ్చేది కాదు. ఆ విషయం మనందరికీ కూడా తెలుసు.
  • పర్ క్యాపిటా ఇన్ కం లో దేశంలో నంబర్ వన్ స్థితిలో ఉన్నాం.
  • పవర్ పర్ క్యాపిటాలో దేశంలో నంబర్ వన్ స్థితిలో ఉన్నాం.
  • అదిలాబాద్ జిల్లాలో ముఖరా(కె) గ్రామం మొత్తం ఇండియాలోనే బ్రహ్మాండమైన అవార్డులు తీసుకుంటూ మనందరినీ గర్వంగా నిలబెడుతా ఉంది.
  • మంచినీటి సరఫరా, విద్యుత్ సరఫరా, అనేక విషయాలలో అనేక అద్భుతాలు మనం సాధించాం. దానిలో ఎలాంటి అనుమానం అవసరంలేదు మనకు.
  • ప్రపంచవ్యాప్తంగా హ్యుమన్ ఇండెక్స్ డెవలప్ మెంట్ లో పరిగణలోకి తీసుకునే ప్రధాన అంశాలు రెండే ఉంటయ్.. 1. విద్యుత్ పర్ క్యాపిటా వినియోగం 2.పర్ క్యాపిటా ఆదాయం.
  • ‘వాకిలిని చూస్తే ఇళ్లు సంగతి తెలుస్తది’ అన్న సామెత ప్రకారంగా మన పర్ క్యాపిటా, పర్ క్యాపిటా పవర్ యుటిలైజేషన్ లను చూస్తే తెలుస్తుంది.. మనం ఎంత బ్రహ్మాండంగా పురోగమించిపోయామో.
  • మన కంటే ముందే ఎప్పటినుంచో ఉన్న తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ లాంటి ఉద్ధండులైన రాష్ట్రాలు కంటే ఎంతో ముందంజలో ఉన్నాం.
  • ఇది ఎవరో ఒక్కరు చేస్తే కాలేదు. మనందరి సమిష్టి కృషి వల్లనే సాధ్యమైంది.
  • ఇంతటితోనే మనం పొంగిపోయి ఇంకేం చేయాల్సింది లేదనుకుంటే చాలా పెద్ద తప్పవుతుంది.
  • చాలా పేదరికం ఉంది సమాజంలో తరతరాలుగా అణిచివేయబడుతున్న దళిత జాతి, ఎన్నో బాధలున్నటువంటి మన గిరిజన జాతి, వెనుకబడిన కులాల్లో కూడా చాలా వెనుకబడి ఉన్నారు.
  • మత్స్యకారులకు, గొర్రెల పెంపకందారులకు రకరకాల వర్గాలకు కొంత చేసుకున్నాం. కానీ జరగవలసింది ఇంకా చాలా ఉంది.
  • ఇదే పట్టుదల, ఇదే కృషి, ఇదే పద్ధతిలో ఒక తాటి మీద నడిచి మనం ముందుకుపోయి దళిత బిడ్డలను, గిరిజన బిడ్డలను, వెనుకబడిన తరగతుల్లో ఉన్నటువంటి అత్యంత నిరుపేదలను, అగ్రవర్ణాల్లో ఉన్న నిరుపేదలను అందరినీ కూడా ఒక సమానస్థాయిలోకి తెచ్చే స్థితికి మనం పోవాలి. ఒక బాధ్యత మనమీద ఉంటది.
  • రాబోయే రోజుల్లో ఎన్నికల తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ప్రతి తాలూకాలో ఎక్కడికక్కడే వచ్చే విధంగా చాలా పెద్ద ఎత్తున మనం కార్యక్రమాన్ని తీసుకోబోతావున్నం.అత్యధిక పురోగతి ఉన్న రాష్ట్రం స్థితిలోకి మనం పోబోతావున్నాం.
  • చాలా కొత్త కార్యక్రమాలు, కొత్త ప్లానింగ్ ఉంది.
  • తాగునీటి సమస్య, కరెంటు సమస్య, సాగునీళ్లకు సమస్య, పంటలు పండేటివి కాదు. ప్రజలు వలసబోయే పరిస్థితులన్నింటినీ ఈ తొమ్మిదేళ్లలో మనం అధిగమించాం.
  • ఇప్పుడొక పద్ధతికి వచ్చాం. స్థిరపడ్డాం. బడ్జెట్ బాగుంది. ఆర్థిక పరిస్థితి బాగుంది. కాబట్టి పటిష్టపరుచుకున్న ఈ పునాది..పునాదిగా భవిష్యత్ కోసం బ్రహ్మాండంగా మనం పురోగమించాల్సిన అవసరం ఉంటది.
  • అందరం మరింత కష్టపడి మన రాష్ట్రంలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించడానికి, దేశానికే తలమానికంగా అగ్రభాగాన ఉండేదానికి కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాను.
  • పోడు భూముల పంపిణీని బ్రహ్మాండంగా నిర్వహించే పరిస్థితి కల్పించి, వారికి అన్ని కూడా అందజేయాలి. వాళ్లకి ఈ సీజన్ నుంచే రైతు బంధు కూడా అందించే ఆలోచన ఉంది కాబట్టి వాళ్ల బ్యాంకు ఖాతాలు తెరిపించి, ఐఎఫ్ఎస్ సి కోడ్ కూడా పంపించే విధంగా కలెక్టర్ ఆ చర్యలు తీసుకోవాలి.
  • మానవీయ కోణంలో మనం తీసుకునే మంచి కార్యక్రమాలను బ్రహ్మండంగా అందించగలిగినాం.
  • పల్లెలల్లో ఒంటిరి మహిళలు, వృద్ధులు, బీడీ కార్మికులు, ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి వినూత్నమైన పథకాలు సంక్షేమం గురించి మనం తీసుకున్నాం.
  • ఇటీవల కాలంలో నేను మహారాష్ట్రకు పోతే మీ దగ్గర ఇట్లా ఉందా..ఇలా జరుగుతుందా..అని అనుమానాలు వెలిబుచ్చుతాఉన్నరు. బ్రహ్మండంగా మాక్కూడా ‘తెలంగాణ మాడల్’ కావాలని కోరుతా ఉన్నరు.
  • తెలంగాణ మాడల్’ భారత దేశమంతా మారుమ్రోగుతుందంటే ఖచ్ఛితంగా కారణభూతులు మీరే అని మనవి చేస్తావున్నా
  • చక్కగా సమన్వయ పరుచుకున్న ప్రజాప్రతినిధులు, చాలా కమిట్ మెంట్ తో పనిచేస్తున్న మా ఉద్యోగుల అందరి కృషియే ఈ కారణమైంది. మరొక్కసారి మీ అందరికీ నూతన కలెక్టరేట్, దశాబ్ధి ఉత్సవాలు మరియు మీరు సాధించిన విజయాలకు మీరందరూ భాగస్వాములు కాబట్టి ప్రజల పక్షాన, నా పక్షాన మీకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.