జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవం

inauguration-of-Jagtial-Collectorate-

జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఈ రోజు ప్రారంభించారు.

అనంతరం జగిత్యాల కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. ప్రసంగం ముఖ్యాంశాలు:

ఉద్యమ ప్రస్థానంలో మా తెలంగాణ మాకు కావాలె అని మనమంతా కొట్లాడినం
తెలంగాణ వస్తే ధనిక రాష్ట్రం అవుతుందని నేను అప్పుడే చెప్పిన. అది నిజమైంది
తెలంగాణలో ప్రతివారికీ మేలు జరిగేలా సంక్షేమ కార్యక్రమాలను ఇచ్చుకుంటున్నం
తెలంగాణలో అద్భుతమైన విజయాలను మనం సాధించుకున్నం. ఉద్యోగులందరి సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైంది
రాష్ట్రం ఏర్పడిన నాడు మనది అనిశ్చితమైన స్థితి ఉండేది. కరెంటు రాదు, నీళ్లు లేవు, వలసలు పోయేవారు
కానీ, నేడు ఎంతో అభివృద్ధి జరిగింది. వ్యవసాయానికి దేశంలోనే 24 గంటలూ కరెంటు ఇస్తున్నది తెలంగాణ రాష్ట్రం మాత్రమే
తెలంగాణ వచ్చిన నాడు మనది 62 వేల కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రమే. ఈసారి మనం ఖచ్చితంగా 2 లక్షల 20 వేల కోట్లకు చేరుకుంటం
అన్నిరంగాల్లో మనం దేశంలోనే నంబర్ వన్ గా నిలిచినమంటే ప్రజా ప్రతినిధులు, ఉద్యోగుల సమిష్టి కృషి, సహకారమే కారణం
ఇవాళ తెలంగాణ ఉన్నతస్థాయికి చేరుకోవడానికి అందరం కష్టపడటమే కారణం
గురుకుల విద్యలో మనకు మనమే పోటీ, ఇండియాలోనే మనకు పోటీ లేదు
కేంద్రం సహకరించకున్నా మనం 33 జిల్లాలకు 33 మెడికల్ కాలేజీలు కట్టుకుంటున్నం ఆసరా పెన్షన్లు ఇస్తే అవసరాలు తీరేలా ఉండాలని నేనే ఈ నిర్ణయం తీసుకున్న
‘‘మా కొడుకులు సూడకపోతే చెర్లల్ల బాయిలల్ల పడి సచ్చిపోతా వుంటిమి. ఇపుడు ఠంఛనుగా నెలకు రూ.2,016 పెన్షన్ వస్తున్నది’’ అని పెద్దోళ్లు దీవిస్తున్నరు. ఇట్లాంటి దీవెనలకన్నా ఒక పరిపాలకుడికి కావలసిన సంతృప్తి ఇంకేమున్నది?
తెలంగాణ పల్లెల్లోకి పంపిణీ చేస్తున్న లక్షల రూపాయలతో పల్లెల్లో పరపతి పెరిగింది అని ఆర్థికవేత్తలు అంటున్నరు.
రాష్ట్రంలో పండే మొత్తం ధాన్యాన్ని కొంటున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ మాత్రమే ఐదేండ్లలోపు మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ నీళ్లిస్తం, లేకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయం అని ఎంతో ధైర్యంగా చెప్పిన. ఆ మాట నిలబెట్టుకొని చేసి చూపించిన
ఇపుడు దాదాపు 40 వేల ఓవర్ హెడ్ ట్యాంకులున్నయి. 19 ఇంటేక్ వెల్స్ నుంచి నీళ్లు తీసుకొని శుద్ధి చేసి ఈ ట్యాంకుల కంటే ఎక్కువ ఎత్తుకు పంపి గ్రావిటీ ద్వారా సరఫరా చేస్తరు
ఇట్లా అన్ని రంగాల్లో మేధో మధనం చేయడం వల్లనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతున్నది ఆనాడు అడవుల్లో అభివృద్ధే లేదు. నేడు హరితహారంతో ప్రపంచంలోనే పేరు తెచ్చుకున్నం
తెలంగాణలో అభివృద్ధి జరుగుతున్నది. దాన్ని అందిపుచ్చుకునే దశకు మనం చేరుకున్నం
మరింత కమిట్ మెంటుతో మనం కృషి కొనసాగిస్తే, గొప్పగా ముందుకు పోతం

ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ కొప్పుల ఈశ్వర్, శ్రీ హరీశ్ రావు, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీ గంగుల కమలాకర్, ఎంపీలు శ్రీ దామోదర్ రావు, శ్రీ వెంకటేశ్ నేత, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్యేలు శ్రీ సుంకే రవిశంకర్, శ్రీ చెన్నమనేని రమేశ్, శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, శ్రీ బాల్క సుమన్, శ్రీ రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీలు శ్రీమతి కవిత, శ్రీ ఎల్.రమణ, శ్రీ గంగాధర్ గౌడ్, శ్రీ పాడి కౌశిక్ రెడ్డి, సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్, సీఎంవో అధికారులు శ్రీమతి స్మితా సభర్వాల్, శ్రీమతి ప్రియాంక వర్గీస్, వివిధ కార్మొరేషన్ల ఛైర్మన్లు శ్రీ ఎర్రోళ్ల శ్రీనివాస్, శ్రీ కోలేటి దామోదర్ గుప్తా, శ్రీ అనిల్ కూర్మాచలం, శ్రీ రవీందర్ రావు, జెడ్పీ ఛైర్మన్ శ్రీమతి వసంత, మున్సిపల్ ఛైర్మన్ శ్రీమతి శ్రావణి, కరీంనగర్ మేయర్ శ్రీ సునీల్ రావు, మాజీ ఎమ్మెల్సీలు శ్రీ నారదాసు లక్ష్మణ్ రావు, శ్రీ రాజేశ్వర్ రావు, ఆలయ ఛైర్మన్ శ్రీ శ్రీకాంత్ రెడ్డి, శ్రీ రాజేశ్ గౌడ్, మెడికల్ డీఎంఈ శ్రీ రమేశ్ రెడ్డి, ఆర్ అండ్ బీ ఈఎన్సీ శ్రీ గణపతిరెడ్డి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు శ్రీ సుద్దాల సుధాకర్ తేజ, ఆర్కిటెక్ట్ శ్రీమతి ఉషా రెడ్డి, కలెక్టరేట్ నిర్మాణ సంస్థ నవతేజ్ ఇన్ ఫ్రా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.