ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం

​ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్‌ ఎల్‌బీ మైదానంలో వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి మహాసభలను ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ శ్రీ నరసింహన్‌, మహారాష్ట్ర గవర్నర్‌ శ్రీ విద్యాసాగర్‌రావు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు, శాసనసభ స్పీకర్‌ శ్రీ మధుసూదనాచారి, మండలి ఛైర్మన్‌ శ్రీ స్వామిగౌడ్‌, ఉప ముఖ్యమంత్రి శ్రీ కడియం శ్రీహరి, రాష్ట్ర మంత్రులు శ్రీ ఈటల రాజేందర్‌, శ్రీ కేటీ. రామారావు, శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, శ్రీ జగదీశ్‌రెడ్డి, శ్రీ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శ్రీ మహేందర్‌రెడ్డి, శ్రీ లక్ష్మారెడ్డి, ఎంపీలు శ్రీ బండారు దత్తాత్రేయ, శ్రీ జితేందర్‌రెడ్డి, శ్రీ కేశవరావు, శ్రీ అసదుద్దీన్‌ ఒవైసీ, సాహిత్య అకాడమీ అధ్యక్షుడు శ్రీ నందిని సిధారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కవులు, కళాకారులు, తెలుగు భాషాభిమానులు పాల్గొన్నారు.